HomeTelugu NewsKarthikeya 3: ఆ హిట్‌ సీక్వెల్‌ అప్డేట్‌ ఇచ్చిన నిఖిల్‌

Karthikeya 3: ఆ హిట్‌ సీక్వెల్‌ అప్డేట్‌ ఇచ్చిన నిఖిల్‌

Karthikeya 3 official annou

టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ.. చందు మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన కార్తికేయ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ తరువాత 2022లో వచ్చిన ఈ మూవీ సీక్వెల్స్‌ ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్‌ అందుకోవ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లును రాబ‌ట్టింది. అయితే ఈ సినిమా వ‌చ్చిన రెండు ఏండ్ల త‌ర్వాత నిఖిల్, చందుల కాంబో రిపీట్ కాబోతుంది. తాజాగా కార్తికేయ 3కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ ప్రాజెక్ట్‌పై నిఖిల్ సిద్దార్థ ఎక్స్ వేదిక‌గా ప్రకటించాడు. సరికొత్త సాహసాన్ని వెతికే పనిలో డాక్టర్‌ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం అంటూ నిఖిల్ రాసుకోచ్చాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతుండ‌గా.. ‘కార్తికేయ 2’తో పోలిస్తే ఇది భారీ బ‌డ్జెట్‌తో రూపొందించనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం.. నిఖిల్ మ‌రోవైపు పాన్ ఇండియా చిత్రం స్వయంభు చేస్తున్నాడు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ భామ సంయుక్తామీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాలో నిఖిల్​ ఓ యోధుడి​ పాత్రలో కనిపించనున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu