‘షకీలా’ లుక్‌

నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘షకీలా’. బాలీవుడ్‌ నటి రిచా చద్దా ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ‘లవ్‌ యు అలియా’ దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మేజిక్‌ సినిమాస్‌, యోధాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ రోజు ‘మంగళవారం’ మూవీ యూనిట్‌ షకీలా లుక్‌ను షేర్‌ చేసింది. ఈ ఫోటో ఆకట్టుకునే విధంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రిచా ఊహించని విధంగా ఉన్నారు. ఒంటి నిండా బంగారు నగలతో కనిపించారు. షకీలా పోర్న్‌స్టార్ కాదని పోస్టర్‌లో పేర్కొన్నారు. 2019 వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.