‘రంగస్థలం’ ప్రీరిలీజ్ బిజినెస్ వంద కోట్లు!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అనగానే అసలు వీరిద్దరికి సింక్ అవుతుందా..? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఒక్కసారి సినిమా సెట్స్ పైకి వెళ్ళాక.. సుకుమార్ మార్క్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయకపోయినా.. ఆన్ లొకేషన్ ఫోటోలు ముచ్చట్లు పంచుకుంటూ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. ఇప్పుడు సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ వచ్చిందంటే.. ఈ సినిమాకు వంద కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో 20 కోట్ల వరకు వచ్చాయి. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడిపోయాయి. మ్యూజిక్ రైట్స్ మిగిలిన హక్కులు మొత్తం కలిపి 5 కోట్లు వరకు పలికాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ కలిపి ఎలా లేదన్నా.. 65 కోట్ల వరకు పలుకుతాయి. మొత్తం కలిపి వంద కోట్లకు పైనే ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతోందన్నమాట.