HomeTelugu Newsదేశవ్యాప్తంగా రెడ్‌ జోన్‌లో 130 జిల్లాల్లు

దేశవ్యాప్తంగా రెడ్‌ జోన్‌లో 130 జిల్లాల్లు

13
దేశవ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్‌ జోన్‌లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. 284 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లోను, 319 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 5 రెడ్‌జోన్లు, 7 ఆరెంజ్ జోన్లు, ఒక గ్రీన్ జోన్‌ ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది.. తెలంగాణలో 6 రెడ్‌ జోన్లు, 18 ఆరెంజ్‌ జోన్లు, 9 గ్రీన్ జోన్లు ఉన్నట్టు వెల్లడించింది. కేంద్రం ప్రకటించిన జాబితాలో దేశంలోని ప్రధాన నగరాలన్నీ రెడ్‌జోన్‌లోనే ఉన్నాయి. ఢిల్లీ సహా 6 ప్రధాన నగరాల్లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నందున రెడ్‌జోన్లో ఉన్నట్టు ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ రెడ్‌జోన్‌లో ఉన్నట్టు కేంద్రం తెలిపింది.

ఏపీలో రెడ్‌ జోన్లు (5) : కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు… ఆరెంజ్ జోన్లు (7): తూ.గో, ప.గో, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ… గ్రీన్ జోన్లు(1):విజయనగరం

తెలంగాణలో రెడ్‌ జోన్లు (6): హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్

Recent Articles English

Gallery

Recent Articles Telugu