రీషూట్స్ లో శేఖర్ కమ్ముల!

మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమాలను రూపొందిస్తుంటాడు. ‘అనామిక’ సినిమా తరువాత ఆయన నుండి మరో సినిమా రాలేదు. చాలా గ్యాప్ తీసుకున్న అనంతరం ‘ఫిదా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 21న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇటీవల సినిమా రషెస్ చూసిన నిర్మాత దిల్ రాజు మరీ క్లాస్ గా, ఆడియన్స్ కు కనెక్ట్ కానీ కొన్ని సన్నివేశాలను అందరికీ నచ్చే విధంగా చిత్రీకరించమని సూచించాడట.

fదీంతో దానికి సంబంధించిన పనుల్లో శేఖర్ కమ్ముల ఉన్నాడని తెలుస్తోంది. ఇక సినిమా ద్వారా చాలా కాలం తరువాత మరో నటుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతడే సాయి చంద్.. గతంలో శివ, అంకురం వంటి సినిమాల్లో నటించిన సాయి చంద్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ సినిమాలో ఆయన హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించనున్నాడు.