HomeTelugu Trending'18 పేజెస్‌' ట్రైలర్‌ అప్డేట్‌

’18 పేజెస్‌’ ట్రైలర్‌ అప్డేట్‌

18 pages trailer release da
నిఖిల్ సిద్దార్థ, అనుప‌మ పరమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ’18 పేజెస్’.ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందిచారు. ప‌ల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌ డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ట్రైలర్ అప్డేట తెలియజేశారు. డిసెంబర్ 17న ట్రైలర్ రాబోతున్నట్టు పుస్తకంలోని పేజీపై డిస్‌ప్లే చేస్తూ వినూతనంగా ప్రకటించారు.

గోపీసుందర్ సంగీతం అందిస్తున్నఈ సినిమాలో.. కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు పాడిన ‘టైం ఇవ్వు పిల్లా’ పాట ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2-సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై సంయుక్త నిర్మాణంలో బన్నీవాసు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే నిఖిల్ సిద్దార్థ నటించిన ‘కార్తికేయ-2’ మంచి విజయం సాంధించింది. అనుపమ కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu