HomeTelugu Trendingరాజమౌళి-మహేష్ బాబు మూవీలో హాలీవుడ్ యాక్టర్స్

రాజమౌళి-మహేష్ బాబు మూవీలో హాలీవుడ్ యాక్టర్స్

Rajamouli and Mahesh

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. RRR మూవీ అఖండ విజయం తర్వాత రాజమౌళి ఈ మూవీని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. దానికి తగ్గట్టుగానే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారు.

ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది ఆఫ్రికన్ అడ్వెంచర్ ఫిల్మ్ అన్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటులను తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు.

ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరికి మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు. 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే మహేశ్-రాజమౌళి సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu