HomeTelugu Big Stories5 గంటల్లోనే 2 మిలియన్‌ వ్యూస్‌!

5 గంటల్లోనే 2 మిలియన్‌ వ్యూస్‌!

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్పైడర్‌’ చిత్రం టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో స్పెషల్‌ క్రేజ్‌ ఏర్పడింది.

విడుదలైన 5 గంటల్లోనే ‘స్పైడర్‌’ టీజర్‌ 2 మిలియన్‌ వ్యూస్‌ని క్రాస్‌ చేయడమే కాకుండా 1 లక్ష 20 వేల లైక్స్‌ సాధించిందంటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంత భారీ అంచనాలు వున్నాయో అర్థం చేసుకోవచ్చు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందుతున్న ‘స్పైడర్‌’ చిత్రం సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీర్‌లోనే ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుందని టీజర్‌ని చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!