HomeTelugu Big Stories'మేజర్‌' గ్లింప్స్ విడుదల చేసిన మహేష్‌ బాబు

‘మేజర్‌’ గ్లింప్స్ విడుదల చేసిన మహేష్‌ బాబు

Adivi Sesh Major movie Gl
టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం మేజర్‌. ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈసినిమాకి ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో మహేష్ బాబు-జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నేడు (మార్చి 15) మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ‘మేజర్’ గ్లింప్స్ ని రిలీజ్‌ చేశారు.

ఈక్రమంలో మార్చి 28న టీజర్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల మరియు బాలీవుడ్ హీరోయిన్‌ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మేజర్’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో జులై 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu