ఫిబ్రవరిలో విడుదల కానున్న చిత్రాలు!

జనవరిలో సంక్రాంతి కనుకగా రావాలనుకున్న సినిమాలన్నీ ‘ఖైదీ’,’శాతకర్ణి’ ల ఎఫెక్ట్ తో వెనక్కి తగ్గాయి. ఇక ఇప్పుడు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి.  ముందుగానే ‘ఓం నమో వెంకటేశాయ’,’నేను లోకల్’,’ఘాజీ’,’విన్నర్’,’సింగం3′ వంటి సినిమాలు రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేసేశాయి. ఇక మిగిలిన రెండు మూడు సినిమాలు ‘లక్కున్నోడు’, ‘లక్ష్మీబాంబ్’,’ద్వారకా’ వంటి సినిమాలు కూడా ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు సమాచారం.

మార్చిలో పరీక్షలు ఉంటాయి గనుక ఫిబ్రవరిలోనే సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మార్చి తరువాత ఏప్రిల్ లో ‘బాహుబలి2′,’కాటమరాయుడు’ అలానే మహేశ్ బాబు సినిమాలు విడుదల కావడం ఖాయం. అందుకే పెద్ద సినిమాలతో పోటీ లేకుండా ఫిబ్రవరిలోనే సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నారు.
,