HomeTelugu News32 వసంతాలు పూర్తిచేసుకున్న "నాగ్"

32 వసంతాలు పూర్తిచేసుకున్న “నాగ్”

అక్కినేని కుటుంబానికి “మనం” మరుపురాని చిత్రం. ఈ చిత్రంలో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల వారు కలిసి నటించారు. పైగా ఏఎన్నార్‌కు ఇది చివరి చిత్రం కావడంతో ఈ సినిమా వారికి ఎంతో ప్రత్యేకం. “మనం” విడుదలై ఈరోజుకు నాలుగు సంవత్సరాలైన సందర్భంగా నాగార్జున ట్విటర్‌ ద్వారా తన భావాలను వెల్లడించారు.

6 5

నాన్నా… నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాం అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. నా మొదటి సినిమా “విక్రమ్”‌, నాన్న చివరి చిత్రం “మనం” ( మే 23) ఒకే తేదీన విడుదలయ్యాయి. దీని కోసం ఎటువంటి ప్లాన్‌ చేసుకోలేదు. అంతే కాక 23 తిరగేస్తే 32 వస్తుంది. నేను సినీరంగ ప్రవేశం చేసి 32 సంవత్సరాలౌతుంది. మాపై ఎంతో ఆదరణ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!