HomeOTT35 CKK: థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు ఓటిటిలో

35 CKK: థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు ఓటిటిలో

35 CKK locks its OTT release date
35 CKK locks its OTT release date

35 CKK OTT:

ఈ మధ్యనే విడుదలైన కుటుంబ కథా చిత్రం 35 చిన్న కథ కాదు (35 CKK) లో హీరోయిన్ గా నటించిన నివేదా థామస్ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నంద కిశోర్ ఎమని డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. విశ్వదేవ్ రచకొండ, ప్రియదర్శి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

సెప్టెంబర్ 6న విడుదల అయిన ఈ చిత్రానికి అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసల వర్షం కురిసింది. కథ, స్క్రీన్ ప్లే, పాటలు, డైలాగ్స్ అన్నింటితో పాటు నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. చిన్న బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం పెద్ద నంబర్లు నమోదు చేసుకుంది.

తాజాగా ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ పై ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ వార్త గురించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడనుంది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రాబోతుందా అని ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో గౌతమి, భగ్యరాజ్, అరుణ్ దేవ్ పోతుల తదితరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. సినిమాను రానా దగ్గుబాటి సమార్పించగా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రల్లపల్లి నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకి అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు.

Read More: Devara ఓకే కానీ RRR కంటే కాదుగా అంటున్న ఫ్యాన్స్

థియేటర్లలో విశేష ఆదరణ పొందిన ఈ సినిమాకి ఓటిటిలలో కూడా అంతే మంచి రెస్పాన్స్ వస్తుంది అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu