HomeTelugu Big Storiesఈ ఏడాది 1000 కోట్లు టార్గెట్ గా విడుదల కాబోతున్న Upcoming Indian Films ఇవే..

ఈ ఏడాది 1000 కోట్లు టార్గెట్ గా విడుదల కాబోతున్న Upcoming Indian Films ఇవే..

4 Upcoming Indian Films That Could Cross 1000 Crores in 2025!
4 Upcoming Indian Films That Could Cross 1000 Crores in 2025!

Upcoming Indian Films 2025:

ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌కి పండగే అనిపిస్తుంది! చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయ్… ఇప్పుడు భారీ సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. అందులో టాప్ 4 సినిమాలే… 1000 కోట్ల కలెక్షన్స్ అందుకునే చాన్స్ ఉన్నవిగా ఫ్యాన్స్ కుర్రాళ్లు చర్చలు చేసుకుంటున్నారు. ఇవే ఆ నాలుగు భారీ సినిమాలు:

1. వార్ 2 (War 2):
హృతిక్ రోషన్ – జూ. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ బిగ్గీ. YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్. నార్త్‌లో హృతిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాస్‌గా ఉంది. సౌత్‌లో ఎన్టీఆర్ ఫై రేంజ్‌లో క్రేజ్ ఉంది. యాక్షన్, యూనివర్స్, ఫైట్లు అన్నీ కలిస్తే… బాక్సాఫీస్‌కి టికెట్ పక్కా!

2. కూలీ (Coolie):
రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అంటేనే ఓ బెంచ్‌మార్క్. అదే డేట్ (ఆగస్టు 15)కి రాబోతుంది కాబట్టి వార్ 2తో డైరెక్ట్ పోటీ. లోకేష్ ఇంటెన్స్ మేకింగ్, రజనీ స్టైల్ కలిస్తే… ఫ్యాన్స్ ఊపే వేరే ఉంటుంది.

3. ద రాజా సాబ్ (The Raja Saab):
ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులు నుంచి ఓ మాస్ హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి మాస్ మాసాలా ఎంటర్టైనర్‌గా “ద రాజా సాబ్” వస్తున్నాడు. ఫస్ట్ లుక్‌పై క్రేజ్ బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెరిగిపోతున్నాయి.

4. కాంతారా: చాప్టర్ 1 (Kantara Chapter 1):
రిషబ్ శెట్టి తీసిన కాంతారా ఫస్ట్ పార్ట్ ఎలా హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అక్టోబర్ 2న రాబోయే ఈ ప్రిక్వెల్‌కు నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. పాన్ ఇండియా బాక్సాఫీస్‌కు బిగ్ బూస్ట్ కావొచ్చు.

ఈ నాలుగు సినిమాల్లో కనీసం రెండు సినిమాలు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉందని ట్రేడ్ టాక్. 2025 అంటే నిజంగా “బ్లాక్‌బస్టర్ ఇయర్” అనేలా ఉంది!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!