లవకుశకు పర్మిషన్ దొరకలేదుగా!

స్టార్ హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు వేయడం అనేది సాధారణం. అయితే ఈ మధ్య హైదరాబాద్ పోలీసులు మాత్రం దీనికి పర్మిషన్స్ ఇవ్వడం లేదు. పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ సినిమా నుండి బాలయ్య ‘పైసా వసూల్’ వరకు కూడా ఒక్క బెనిఫిట్ షో కూడా పడలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం
చేస్తోన్న ‘జైలవకుశ’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి అర్ధరాత్రి షో చూసి తీరాలని ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు.

నైజాం రైట్స్ దిల్ రాజు తీసుకోవడంతో పర్మిషన్లు తేలికగా వచ్చేస్తాయని భావించారు. కానీ అక్కడ డీసీపీ సెలవులో ఉండడం, ఇంచార్జ్ డీసీపీ ఎటు తేల్చకపోవడంతో అక్కడ కూడా అనుమతి వస్తుందో లేదో తెలియదు. ఇక హైదరాబాద్ లో తెల్లవారు జామున 3 గంటలకు ఫ్యాన్స్ షో వేయాలని ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన టికెట్స్ కూడా అమ్మేశారు. కానీ పర్మిషన్ మాత్రం దొరకలేదు. ఉదయం 5 దాటిన తరువాతే షో వేయాలని పోలీసులు చెబుతున్నట్లు తెలుస్తోంది.