50 రోజులు పూర్తిచేసుకున్న ‘భరత్‌ అనే నేను’

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ముఖ్యమంత్రిగా వెండితెరపై అడుగుపెట్టి నేటితో 50 రోజులు. మహేష్‌ బాబు హీరోగా కొరాటల శివ దర్శకత్వంలో రూపొందిచబడిన చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఈ చిత్రం ఏప్రిల్‌ 20న విడుదలై బాక్సాఫీస్‌ జోరు కొనసాగిస్తూ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇందులో మహేష్‌ ముఖ్యమంత్రిగా చూపిన అభినయానికి ప్రేక్షక లోకం ఫిదా అయింది. మహేష్‌ కెరీర్‌ లోనే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన మూవీగా నిలిచిన ఈ చిత్రం క్లాస్‌, మాస్‌ ఆడియన్స్‌ అందరినీ ఆకట్టుకుంది.

డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌ పై డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్‌ సరసన కైరా అద్వానీ ఆడిపాడింది. ఈ చిత్రానికి దేవీ శ్రీ అందించిన బాణీలు బాగా ప్లస్‌ అయ్యాయి. అంతకు ముందు చిత్రానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖుల ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. ఇక సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌ సాధించి 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ వారు చిత్ర యూనిట్‌ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ యూనిట్‌ మొత్తాన్ని ట్వీట్టర్‌ వేదికగా అభనందించారు