కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ “ప్రగతినివేదన సభ”

తెలంగాణలో కొంగరకలాన్‌ వద్ద టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న”ప్రగతినివేదన సభ” ప్రారంభమైంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొంగర కలాన్‌ చేరుకున్నారు. సభాప్రాంగణం వెనుక వైపు హెలిపాడ్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభావేదికపై ఆసీనులయ్యారు. సభ ప్రారంభానికి ముందు కళాకారులు ఆట పాటలతో హోరెత్తించారు. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన కళాకారులతో కొంగర కలాన్‌ జనసంద్రంగా మారింది. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.