HomeTelugu Newsసోనూసూద్‌ను కొడుతున్న హీరో..కోపంతో టీవీ పగలగొట్టిన బాలుడు

సోనూసూద్‌ను కొడుతున్న హీరో..కోపంతో టీవీ పగలగొట్టిన బాలుడు

7 years boy broken tv due t

తన అభిమాన హీరో సోనూసూద్‌ను సినిమాలో కొట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ బాలుడు టీవీని పగుల గొట్టాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌‌నగర్ మండలం వేపలసింగారానికి చెందిన చండపంగు పుష్పలత, ప్రణయ్‌కుమార్‌లు(ఏడేళ్లు) తమ కుమారుడు విరాట్‌తో కలిసి న్యాల్కల్ వెళ్లారు‌.

అందురు కలిసి రాత్రి టీవీలో దూకుడు సినిమా చూస్తున్నాడు. ఈ క్రమంలో హీరో మహేశ్‌బాబుకు విలన్‌ సోనూసూద్‌ మధ్య ఫైటింగ్‌ సీన్‌ జరుగుతుంది. సోనూసూద్‌ను కొట్టడాన్ని చూసిన విరాట్‌కు కోపం వచ్చింది. కరోనా టైంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్‌ అంకుల్‌ని కొడతావా అంటూ బయటకు వెళ్లి ఓ రాయిని తెచ్చి టీవీపై కోపంతో కొట్టాడు. దీంతో టీవీ పగిలిపోయింది.

పక్కనే సినిమా చూస్తున్న మరదలు అద్విన్‌ టీవీని పగుల గొడతావా? ఇంకో టీవీ తీసుకరా అంటూ ఏడవ సాగింది. గమనించిన కుటుంబ సభ్యులు టీవీని ఎందుకు పగుల గొట్టావురా అంటూ విరాట్‌ను నిలదీశారు. అందరికీ సాయం చేస్తున్న సోనూసూద్‌ అంకుల్‌ను వేరే వాళ్లు కొడుతుంటే కోపం వచ్చి రాయితో కొట్టాను అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఈ విషయం కాస్తా అందరికి తెలియడంతో వైరల్‌గా మారింది. విరాట్‌ టీవీ పగలగొట్టిన ఘటన చివరికి సోనూసూద్‌ను చేరడంతో ట్విటర్‌లో స్పందించాడు. ‘అరేయ్‌.. మీ టీవీ పగలగొట్టకు.. మళ్లీ మీ నాన్న నన్ను కొత్త టీవీ కొనాలని అడుగుతాడు’ అంటూ ట్వీట్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu