HomeTelugu Big Storiesఈ నెలాఖరున సినిమాల పండగే

ఈ నెలాఖరున సినిమాల పండగే

ఈ నెలాఖరున సినిమా అభిమానులకు పండగే. ఎందుకంటే ఒకేరోజు 7 సినిమాలు రిలీజవుతున్నాయి. స్టార్ సినిమాలు లేకపోవడంతో ఒకేసారి 7 చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఒకే రోజు 7 సినిమాలంటే థియేటర్ల కొరత ఏర్పడుతుందేమోనని అనుకుంటున్నారు.

1

నెలాఖరున వచ్చే సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’, ‘శంభోశంకర’, ‘కన్నుల్లో నీ రూపమే’ ‘యుద్ధభూమి’, ‘సంజీవని’, ‘సూపర్ స్కెచ్’. వీటిల్లో కాస్త హైప్ ఉన్న సినిమాల్లో శంభోశంకర, ఈ నగరానికి ఏమైంది.. జబర్దస్త్ ఫేం షకలక శంకర్ హీరోగా రూపొందించిన సినిమా శంభోశంకర, ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. శ్రీధర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్.ఆర్. పిక్చర్స్, ఎస్కే పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చిందని, ఓ స్టార్ హీరో టీజర్‌కు తగ్గని రిజల్ట్ ఇదని నిర్మాత అంటున్నారు. దిల్‌రాజు వంటి అగ్ర నిర్మాత ఈ చిత్రం టీజర్‌ను ప్రశంసించారని అన్నారు.

తరుణ్ భాస్కర్ రచన, దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. నూతన దర్శకుడు బిక్స్ తెరకెక్కిస్తున్న సినిమా కన్నుల్లో నీ రూపమే. ఈ చిత్రంలో హీరో నందు, కన్నడ భామ తేజస్విని ప్రకాష్ జంటగా నటించారు. హార్ట్ టచింగ్, ఫీల్ గుడ్ మూవీగా ఉండబోతుందని చిత్ర దర్శకుడు చెబుతున్నారు.

భారత సరిహద్దుల్లో 1971లో జరిగిన యధార్థ ఘటనల ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన “1971 బియాండ్ బార్డర్స్” చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి యుద్ధభూమిగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర నిర్మాత నిజ జీవితంలో కూడా మేజర్ కావడం విశేషం.

రవి వీడే దర్శకత్వంలో సంజీవని అనే చిత్రాన్ని నివాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను లేటెస్ట్ టెక్నాలజీతో తెరకెక్కించినట్లు దర్శకుడు చెబుతున్నాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, హైఎండ్‌ యానిమేషన్ హైఎండ్ మోడలింగ్, త్రీజీ రెండరింగ్‌తో తీసిన సినిమా అని చెబుతున్నారు. దీనికోసం ఎంతోమంది టెక్నీషియన్స్ చాలాకాలం పాటు కష్టపడి ఈ సినిమా కోసం పనిచేశారని, హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారని దర్శకుడు చెబుతున్నారు. 7 స్టూడియోలు కలిసి విజువల్ ఎఫెక్స్ట్ కోసం పనిచేశారని చెప్పారు. ఈ మూవీలో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ ఏ తెలుగు సినిమాలో చూసి ఉండరని, అంత బాగుంటాయని వివరించారు. ఈ చిత్రంలో అనురాగ్‌ దేవ్, మనోజ్ చంద్ర, తనూజ నాయుడు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రవణ్ కేకే సంగీతం.

ర‌విచావ‌లి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ శుక్ర క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న చిత్రం సూప‌ర్ స్కెచ్‌. ఎరోస్ సినిమాస్ స‌మ‌ర్ప‌ణలో యూ అండ్ ఐ, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడ‌మీ స‌హ‌కారంతో సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి బ‌ల‌రామ్ మ‌క్కల నిర్మాత‌. న‌ర్సింగ్‌, ఇంద్ర‌, స‌మీర్ ద‌త్తా, కార్తిక్, చ‌క్రి మాగంటి, అనిల్‌, శుభాంగి, సోఫియ (కాలిఫోర్నియా), గ్యారిటోన్‌ టోను (ఇంగ్లండ్) బంగార్రాజు, బాబా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇండియా – పాకిస్తాన్‌ల మ‌ధ్య వరల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగితే ఎంత ఉత్కంఠ‌గా ఉంటుందో, ఈ సినిమా కూడా అంతే ఉత్కంఠ‌గా ఉంటుందని నిర్మాత బ‌ల‌రామ్ మ‌క్క‌ల చెప్పారు. దృశ్యం సినిమాలాగా మంచి థ్రిల్ల‌ర్ సినిమా ఇది. ఇత‌ర భాష‌ల్లో రీమేక్ అయ్యేంత స‌త్తా ఉందని దర్శకుడు అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu