
Deepika Padukone Rejected Movies:
దీపికా పదుకొణె అంటేనే గ్లామర్ ఐకాన్. టాలెంట్, డెడికేషన్‌కి బ్రాండ్ అంబాసడర్‌లా ఉంటారు. బాలీవుడ్‌లో ఎంతోమంది హీరోయిన్లకు ఆమె రోల్ మోడల్. అలాంటి దీపికా పదుకొణె కొన్ని పెద్ద సినిమాలను రిజెక్ట్ చేయడం ఓ షాక్ ఇచ్చింది. అయితే ఆమె చెప్పే “నో”లో ఓ రీజన్ ఉంటుంది. అది డేట్స్ కావొచ్చు, పారితోషికం కావొచ్చు లేదా కథపై నమ్మకం లేకపోవడమే కావొచ్చు.
‘స్పిరిట్’ చిత్రానికి నో చెప్పిన కారణాలు:
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ నుంచి దీపికా తప్పుకోవడం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఆమె కొన్ని షరతులు పెట్టారని – 8 గంటల పని సమయం, రూ. 20 కోట్ల రెమ్యునరేషన్, లాభాల్లో వాటా, తెలుగు డైలాగ్స్ చెప్పను అని ఇలా కండిషన్స్ కారణంగా సందీప్ వంగా కి ఆమెకి మధ్య విబేధాలు వచ్చి దీపిక సినిమా నుండి తప్పుకున్నారు అని టాక్.
View this post on Instagram
ఆమె నో చెప్పిన ఇతర హిట్ సినిమాలు:
1. గంగుబాయి కాఠియావాడి – ఆలియా భట్‌తో స్క్రీన్ షేర్ చేయడం ఇష్టం లేక నో చెప్పినట్టు టాక్.
2. రాక్‌స్టార్ – సినిమా విడుదలయ్యాక మాత్రం తాను ఒప్పుకోవాల్సిందని అన్నారు.
3. జబ్ తక్ హై జాన్ – మొదట ఈ సినిమా ఆఫర్ ఆమెకే వెళ్ళింది.
4. ఫాస్ట్ & ఫ్యూరియస్ 7 – ‘రామ్ లీలా’ షూటింగ్ వల్ల డేట్స్ కుదరక చేయలేదట.
5. ధూమ్ 3 – డేట్స్ క్లాష్
6. రాయ్ – దీపిక నో చెప్పాక ఆ పాత్ర జాక్విలిన్ చేసింది
7. సుల్తాన్ – ఇతర కమిట్మెంట్స్ కారణంగా చేయలేకపోయారు.
8. ప్రేమ్ రతన్ ధన్ పాయో – ఆ పాత్ర చివరికి సోనమ్ కపూర్‌కి దక్కింది.
ALSO READ: 2025లో టాప్ 7 Richest Youtube Influencers వీళ్లే!













