
Hyderabad-born Bollywood actresses:
హైదరాబాద్ అంటే రిచ్ కల్చర్, చారిత్రక కట్టడాలు, బిర్యానీ మాత్రమే కాదు. బాలీవుడ్‌కు అద్భుతమైన నటీమణులను అందించిన నగరంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. మన హైదరాబాద్‌లో పుట్టి, బాలీవుడ్‌లో తారాజువ్వలుగా వెలుగొందిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం!
1. షబానా ఆజ్మీ
హైదరాబాదులో పుట్టిన షబానా ఆజ్మీ, దేశంలోనే గౌరవనీయమైన నటీమణుల్లో ఒకరు. ఆమె తండ్రి కైఫీ ఆజ్మీ ప్రముఖ కవి, తల్లి శౌకత్ ఆజ్మీ ఓ ప్రముఖ నాటక కళాకారిణి. 160కు పైగా సినిమాల్లో నటించిన షబానా, బాలీవుడ్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు.
2. సుష్మితా సెన్
మిస్ యూనివర్స్ 1994 టైటిల్ గెలుచుకుని భారతీయ అందాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సుష్మితా సెన్, హైదరాబాద్‌లో తన చిన్నతనం గడిపారు. ఆమె తండ్రి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కావడంతో సెకుందరాబాద్‌లో చదువుకున్నారు. బాలీవుడ్‌లో ఆమె ‘మై హూనా’, ‘బీవీ నెం.1’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
3. టబు
మన అందరికీ తెలిసిన టబు అసలు పేరు టబస్సుం ఫాతిమా హాష్మి. హైదరాబాద్‌లో జన్మించిన ఆమె, సెయింట్ అన్న్స్ హైస్కూల్‌లో చదివారు. టబు నటనలోని విభిన్నత, ఆమె క్యారెక్టర్స్‌కి ఒదిగిపోయే విధానం బాలీవుడ్‌లో ఆమె ప్రత్యేక స్థానం సంపాదించడానికి సహాయపడింది.
4. ఫరా నాజ్ హాష్మి
టబు సోదరి అయిన ఫరా నాజ్, 1980-90లలో ప్రముఖ హీరోయిన్‌గా రాణించారు. కొన్ని టీవీ సీరియళ్లలో కూడా కనిపించిన ఫరా, తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేశారు.
5. దియా మిర్జా
దియా మిర్జా హైదరాబాదీ గర్ల్ అనే విషయం చాలా మందికి తెలియదు! ఆమె బాల్యాన్ని బంజారాహిల్స్‌లో గడిపారు. మిస్ ఏషియా పసిఫిక్ విజేతగా నిలిచిన దియా, తర్వాత బాలీవుడ్‌లో ‘రెహ్నా హై తెరే దిల్ మే’ వంటి హిట్ సినిమాలు చేసారు.
6. అదితి రావు హైదరి
హైదరాబాదీ రాచరిక కుటుంబానికి చెందిన అదితి రావు హైదరి, సినిమాల్లో కూడా రాచరిక అభిరుచిని చూపిస్తున్నారు. ఆమె కుటుంబం, ప్రత్యేకించి అమ్మమ్మవారి ఇల్లు, హైదరాబాద్‌లో ఎంతో ప్రాచీనమైనది. ఆమె నటించిన ‘పద్మావత్’, ‘సమ్మోహనం’ వంటి చిత్రాలు గుర్తింపు తెచ్చాయి.
7. పూనమ్ సిన్హా
బాలీవుడ్ స్టార్ శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా హైదరాబాదీ. ఆమె సినీ కెరీర్‌తో పాటు రాజకీయాల్లో కూడా ఆసక్తి చూపారు. 1968లో ‘మిస్ యంగ్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నారు.
8. పాయల్ రోహత్గి
పాయల్ రోహత్గి హైదరాబాదీ అని చాలామందికి తెలియదు. ‘బిగ్ బాస్ 2’, ‘లాక్ అప్’ వంటి రియాలిటీ షోలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ALSO READ: Jayalalitha properties విలువ ఎంతో తెలుసా? కోట్లు కాదు.. వేల కోట్లు!













