ఆ చిత్రయూనిట్ ను పవన్ అభినందించాడు!

శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన
ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’. ఇప్ప‌టికే విడుద‌లైన
ఈ సినిమా ఆడియో, ట్రైల‌ర్ ల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇప్పుడు స్వ‌యానా
పవ‌న్ క‌ళ్యాణ్ ఈ చిత్ర బృందాన్ని అభినందించారు. ట్రైలర్ బాగా ఆక‌ట్టుకుంది. ఇలాంటి సినిమాను
నిర్మించిన రాఘ‌వ‌య్య ను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు. డైర‌క్ట‌ర్ మోహ‌న్ సినిమాను
బాగా తెర‌కెక్కించాడ‌ని, పాట‌ల‌న్నీ బాగున్నాయని, దీపావ‌ళికి విడుద‌లయ్యే ఈ సినిమా ప్ర‌తీ
ఒక్క‌రినీ అల‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates