ఆ సినిమాపై బన్నీ కన్ను!

అల్లు అర్జున్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న
ఈ హీరో కన్ను ఇప్పుడు ఓ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్
లో చాలా మంది హీరోలు రీమేక్ సినిమాలు చేసి హిట్స్ కొడుతున్నారు. అలానే బన్నీ కూడా
ప్లాన్ చేశాడు. ఆకాష్ శ్రీవత్స అనే దర్శకుడు రూపొందిస్తోన్న కన్నడ సినిమా ‘బద్మాష్’. ఈ
చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. బద్మాష్ గా తిరిగే ఓ యువకుడికి రాజకీయాల నేపధ్యంలో
సాగే కథే ఈ సినిమా. హీరో క్యారెక్టరైజేషన్ బన్నీకు నచ్చడంతో ఆ సినిమాను తెలుగులో రీమేక్
చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’
సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రీమేక్ సినిమాను పట్టాలెక్కించాలని
అనుకుంటున్నాడు. అన్నీ కుదిరితే పివిపి బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించే అవకాశాలు
ఉన్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates