ఫ్లాప్ సెంటిమెంట్ తో మెగా ఫ్యామిలీ!

మెగా ఫ్యామిలీకు ఫ్లాప్ సెంటిమెంట్ ఏంటి అనుకుంటున్నారా..? అసలు విషయంలోకి వస్తే ఈ మధ్య మెగాహీరోలందరూ ఫ్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ.. హిట్స్ కొడుతున్నారు. ఆ సంగతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అఖిల్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో
వేసుకున్న వినాయక్ ను పిలిచి ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి. ఇక ఖైదీ నెంబర్ 150 వినాయక్ కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మిగిలిపోయింది. రామ్ చరణ్ కూడా కిక్ 2 వంటి పెద్ద ఫ్లాప్ సినిమా తీసిన సురేందర్ రెడ్డికి ‘ధృవ’ ఛాన్స్ ఇచ్చి హిట్ అందుకున్నాడు. పవన్ కల్యాణ్ సైతం హిట్స్ లేని డాలీతో ‘కాటమరాయుడు’ సినిమా చేస్తున్నాడు.

గతంలో సాయి ధరం తేజ్ కూడా ఫ్లాప్స్ లో ఉన్న హరీశ్ శంకర్ తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా చేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా హరీష్ శంకర్ తో ‘డిజె’ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు వీరి బాటలో వరుణ్ తేజ్ కూడా నడుస్తున్నాడు. ఆగడు, బ్రూస్ లీ అంటూ వరుస ఫ్లాప్స్ అందుకున్న శ్రీనువైట్ల డైరెక్షన్ లో ‘మిస్టర్’ సినిమా చేస్తున్నాడు. దీన్ని బట్టి ఫ్లాప్ సెంటిమెంట్ మెగా ఫ్యామిలీకి బాగా కలిసొస్తున్నట్లు ఉంది. మరి ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు కూడా హిట్స్ అందుకుంటాయేమో చూడాలి!