ఆ ఘనత ప్రభాస్ కే దక్కింది..!

బాహుబలి చిత్రంతో తన స్టామినాను ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పాడు ప్రభాస్. దానికి కారణం
దర్శకధీరుడు రాజమౌళి. అయితే ప్రభాస్ కు సంబంధించిన ఓ విషయాన్ని అక్టోబర్ 5న చెబుతానంటూ..
ప్రభాస్ అభిమానులను ఊరిస్తున్నాడు రాజమౌళి. దీంతో ప్రభాస్ కు పెళ్లి కుదిరిందని కొందరు
అనుకుంటుంటే.. తనకు హాలీవుడ్ ఛాన్స్ వచ్చిందని.. లేదా ప్రతిష్టాత్మకమైన అవార్డ్ వచ్చి ఉంటుందని
రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రభాస్ కు పెళ్లి కుదరలేదు.. హాలీవుడ్ ఛాన్స్
కూడా రాలేదు. తనకు అరుదైన గౌరవం దక్కబోతోంది. బ్యాంకాక్ లో మేడమ్ టుస్సాట్ మ్యూజియంలో
ప్రభాస్ విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. అది కూడా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విగ్రహం పక్కన.
ఇప్పటివరకు ఏ భారతీయ నటుడికి ఇటువంటి గౌరవం లభించలేదు. ప్రభాస్ కు ఈ గౌరవం
దక్కనుండడం నిజంగా విశేషమే.. ఇప్పటికే ఆ మ్యూజియం కు చెందిన డిజైనర్స్ ప్రభాస్ మెజర్మెంట్స్
తీసుకున్నారని టాక్. ఈ విషయాన్నే సర్ప్రైజింగ్ గా రాజమౌళి చెప్పాలనుకుంటున్నట్లు
సమాచారం.

CLICK HERE!! For the aha Latest Updates