మహేష్ సినిమా టైటిల్ పై తర్జనభర్జనలు!

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో జరుగుతోంది. తెలుగు,
తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ ను దీపావళి కానుకగా
రెండు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే టీజర్ ను రిలీజ్ చేసే లోపు సినిమాకు టైటిల్ ను
కన్ఫర్మ్ చేయాలి. కొన్ని రోజులుగా సినిమా టైటిల్స్ గా ఎనిమీ, అభిమన్యు ఇలా రకరకాలుగా
వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఏది ఫైనల్ చేయలేదని మాత్రం తెలుస్తోంది. కుదిరితే రెండు బాషల్లో
కలిపి ఒకే టైటిల్ ను పెట్టాలని ఆలోచిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates