ఆ యంగ్ హీరోతో మెహ్రీన్!

తెలుగులో ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కు
మొదటి సినిమానే హిట్ కావడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ సినిమాతో
బిజీ అయిన ఈ భామ ఇప్పుడు మరో తెలుగు సినిమా చేయడానికి అంగీకరించింది. సందీప్
కిషన్ హీరోగా సుసీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్
గా మెహ్రీన్ ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం రెండు బాషల్లో
ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు
జరుగుతున్నాయి. సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ ‘నక్షత్రం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే సుసీంద్రన్ తో సందీప్ కిషన్ సినిమా మొదలుకానుంది.