డబ్బింగ్ చెబుతోన్న రజినీకాంత్!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘రోబో2’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అలానే ఒకవైపున సినిమా డబ్బింగ్ పనిని కూడా పూర్తి చేస్తున్నారు. ఈరోజు నుండి సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు. ఈ విషయాన్ని ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రసూల్ పోకూట్టి తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో రజినీకాంత్ సైంటిస్ట్ పాత్రలో అలానే చిట్టి రోబో పాత్రలో కనిపించనున్నాడు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. ఈ కీన్మ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటినుండి సినిమాపై హైప్ మరింత పెరిగింది. 2017 దీపావళి కానుకుగా సినిమాను విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.