HomeTelugu Trendingరామ్‌ విలన్‌గా ఆది పినిశెట్టి!

రామ్‌ విలన్‌గా ఆది పినిశెట్టి!

Aadhi pinishetty as a villa

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్‌ ..తమిళ డైరెక్షన్‌లో లింగుస్వామి ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో విలన్‌ను చిత్ర బృందం ప్రకటించారు. ఈ చిత్రంలో విలన్‌ పాత్రకి ఆది పినిశెట్టి ఎంపికయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా చేస్తూనే విలన్‌ పాత్రలకు సై అంటుంటున్నాడు ఈ యంగ్‌ హీరో. ఈయన ఇప్పటికే ‘సరైనోడు’ చిత్రంలో విలన్‌గా కనిపించి మంచి గుర్తింపు పొందారు. ‘నిన్నుకోరి’, ‘రంగస్థలం’ చిత్రాల్లో సహాయ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు రామ్‌తో తలపడేందుకు సిద్ధమవుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరగనున్నాయి. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!