డేట్‌కు వెళ్లిన విజయ్ దేవరకొండ- రష్మిక ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు రష్మీక మందన్నా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరిద్దరూ.. ప్రేమలో ఉన్నట్లుగా గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవీ.. కేవలం పుకార్లే అని ఇద్దరు కూడా తేల్చేశారు. వీరిద్దరూ కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా వారి వారి మూవీ షూటింగ్స్‌ కోసం ముంబై లో ఉన్నారు.

కాస్త గ్యాప్ తర్వాత కలిసిన వీరిద్దరూ కలవడంతో డేట్ కు వెళ్లారట. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ లో కనిపించగా రష్మీక ఎప్పటి లాగే చాలా క్యూట్ గా కనిపించింది. ఈ ఫొటో లో రష్మీక తెల్లని పూలు చేతిలో పట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణ గా చెప్పుకోవచ్చు. ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates