HomeTelugu Trendingఉగాది నుంచి ఆది సాయికుమార్‌ కొత్త సినిమా ప్రారంభం

ఉగాది నుంచి ఆది సాయికుమార్‌ కొత్త సినిమా ప్రారంభం

Aadi Sai Kumars new movie
టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ శిఖర క్రియేషన్స్‌ బ్యానర్‌పై యుగంధర్‌.టి(గుడివాడ యుగంధర్‌) నిర్మాతగా భాస్కర్‌ బంటుపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్‌ న్యూలుక్‌లో కనిపించనున్నాడు. సాకేత్‌ కోమందూరి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి ఎ.డి.మర్గల్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 13న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. త్వరలోనే హీరోయిన్‌, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని నిర్మాతలు తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu