HomeTelugu Reviews'ఆదికేశవ' మూవీ రివ్యూ

‘ఆదికేశవ’ మూవీ రివ్యూ

Aadikeshava Review
వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆదికేశవ. ఈ సినిమాలో టాలీవుడ్‌ వాటెండ్‌ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. మాస్‌ ప్రేక్షకుల్ని టార్గెట్‌ చేస్తూ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

బాలు (వైష్ణవ్ తేజ్) హాయిగా ఎలాంటి పనీ పాటా లేకుండా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఇంట్లో అతడ్ని తిట్టే తండ్రి ( జయప్రకాష్).. సపోర్ట్ చేసే తల్లి (రాధిక) ఉంటారు. బాలు ఓ కాస్మొటిక్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ కంపెనీ సీఈవో చిత్ర (శ్రీలీల)ను మొదటి పరిచయంలోనే ఇంప్రెస్ చేస్తాడు. బాలు మంచితనం, స్మార్ట్ నెస్, సాయం చేసే గుణాలను చూసి ఇష్టపడుతుంటుంది. అలా సాఫీగా సాగుతున్న బాలు జీవితంలోకి అతని గతం ఎంట్రీ ఇస్తుంది? అసలు బాలు ఎవరు? మహా కాళేశ్వర రెడ్డి (సుమన్)తో బాలుకి ఉన్న రిలేషన్ ఏంటి? బాలు.. రుద్రకాళేశ్వరరెడ్డి ఒకరేనా? సీమలోని బ్రహ్మసముద్రంలో రాక్షస పాలన చేస్తున్న చెంగారెడ్డి (జోజు జార్జ్)తో ఉన్న సంబంధం ఏంటి? చెంగారెడ్డి ఆటల్నీ, ఆధిపత్యాన్ని రుద్రకాళేశ్వర రెడ్డి ఎలా అంతమొందించాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

ఈ సినిమా కథ, కథనం రొటీన్‌గా ఉన్నాయి. ప్రతీ సీన్‌ను సగటు ప్రేక్షకుడు ఊహించేలా ఉన్నాయి. తెరపై సీన్ రాక ముందే సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు చెప్పేస్తుంటాడు. కొన్ని పాత సీన్లను మళ్లీ తీసినట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాదన్యత లేనంట్లు అనిదపిస్తుంది. ఈ సినిమాలో నరుకుడు గురించి దర్శకుడు ప్రత్యేకంగా చెప్పాడు. ఇక క్లైమాక్స్ చూస్తే నిజంగానే బోయపాటిని మించినట్టుగా అనిపిస్తుంది. ఓ వయెలెన్స్, ఆ నరుకుడు చూసి ప్రేక్షకుడికి ఏం చేయాలో అర్థం కాదేమో.

అయితే ఈ చిత్రంలో చివర్లో ఓ ట్విస్ట్ ఇస్తారు. అది మాత్రమే కాస్త కొత్తగా అనిపించింది. సాంకేతిక విషయాలకొస్తే డడ్లీ కెమెరా వర్క్ బాగుంది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫీలో స్టైప్‌లతో శ్రీలీల తన గ్రేస్, లుక్స్, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకుంది. అసలు పాటలు తెరపై వస్తుంటే.. వైష్ణవ్ తేజ్ కనిపించడు. ఎందుకంటే అందరూ శ్రీలీలనే చూసేస్తారు. శ్రీలీల తన డ్యాన్సులతో మరోసారి అందరినీ కట్టిపడేస్తుంది. సినిమాలో ఓ చోట ఎన్టీఆర్, బన్నీ పాటలకు శ్రీలీల స్టెప్పులు వేస్తుంది. మాటలు కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల పంచ్‌లు బాగానే పేలాయి. నిడివి తక్కువ కావడంతో ప్రేక్షకుడు ఊపిరి పీల్చుకుంటాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్రథమార్దంలో వైష్ణవ్ నాచురల్‌గా అనిపిస్తాడు. సెకండాఫ్‌లోఆ నరుకుడు, ఎమోషనల్ సీన్లు, యాక్షన్ సీక్వెన్లలో కాస్త తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. శ్రీలీల ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. ఆమె డ్యాన్సులే అందరికీ గుర్తుంటాయి. జోజు జార్జ్ తెలుగులో చేయడం ఇదే మొదటి సారి. తెలుగులో ఇటువంటి పాత్రలను ఇది వరకు ఎంతో మంది ఎన్నో సార్లు పోషించారు. ఇప్పుడు జోజు జార్జ్ చేశాడంతే. తేడా ఏమీ లేదనిపిస్తుంది. తణికెళ్ల భరణి, రాధిక, జయ ప్రకాష్, సుమన్, సుదర్శన్ ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu