HomeTelugu Reviewsఆదిపురుష్ మూవీ రివ్యూ

ఆదిపురుష్ మూవీ రివ్యూ

 

Aadipurush Movie Review

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రాముడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలై అప్డేట్స్‌ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. మంచి అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కథ రాముడి వనవాసంతో ప్రారంభం అవుతుంది. తనను వలచిన శూర్పనఖను రాముడు తిరస్కరించడం.. అయినా రాముడిపై మోహం తగ్గని ఆమెకు లక్ష్మణుడు బుద్ధి చెప్పి పంపడం.. చెల్లికి జరిగిన అవమానానికి ప్రతిగా జానకిని రావణుడు ఎత్తుకురావడం.. ఆపై సుగ్రీవుడు-ఆంజనేయుల అండతో రాముడు లంకపైకి దండెత్తి రావణుడి ఆట కట్టించి జానకిని తన వెంట తీసుకురావడం.. ఇదీ ‘ఆదిపురుష్’ కథ.

monkey came to adipurush mo

మనకున్న అద్భుత పురాణ గాథల్లో రామాయణం ఒకటి. ఇప్పటికే .. వివిధ భాషల్లో వెండి తెరపై.. బుల్లితెరపై అనేక వెర్షన్లలో ఈ కథను చూశాం. ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించే కథ ఇది. అయితే ఎప్పటికైనా.. రాముడు, రావణుడంటే ఇలా ఉంటాడు. యుద్దాలంటే ఇలా జరుగుతాయి. అని మనం ఇప్పటి వరకూ చూస్తూ వచ్చాం. కానీ.. బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ మాత్రం.. రాముడంటే ఇలాగే ఎందుకుండాలి.. రావణుడంటే అలా ఎందుకు ఉండకూడదు.. యుద్ధాలంటే ఒక మూసలోనే ఎందుకు చూపించాలి.. అని ప్రశ్నలు వేసుకుంటూ ‘ఆదిపురుష్’కు రూపకల్పన చేశాడేమో అనిపిస్తుంది. అతను ఈ ప్రశ్నలు వేసుకుంటూ వేసుకుంటూ తన క్రియేటివిటీని ఓ రెంజ్‌లో చూపించడానికి ట్రై చేశాడు. అయితే..మనం దశాబ్దాలుగా చూస్తున్న రామాయణానికి.. దీనికి పొంతన లేకుండా పొంతన లేకుండా పోయింది. అసహజత్వం.. కృత్రిమత్వంతో నిండిన ఈ కొత్త రామాయణాన్ని చూస్తూ ‘డివైన్’ ఫీలింగ్ పొందాలంటే చాలా కష్టం. పౌరాణికాల విషయానికి వస్తే.. పెద్దగా టెక్నాలజీ లేని రోజుల్లోనే వాటిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఘనత ఒకప్పటి దర్శకులకు చెందుతుంది. ఇప్పుడున్న సాంకేతికతను వాడుకుని ‘ఆదిపురుష్’ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టడానికి ఓం రౌత్ కు అవకాశం దక్కింది. కానీ అతను మాత్రం ‘ఆదిపురుష్’ను చెడగొట్టడానికే టెక్నాలజీని వాడుకున్నాడు. సగం వరకు పర్వాలేదన్నట్లుగా సాగిపోయే ‘ఆదిపురుష్’.. ద్వితీయార్ధంలో యుద్ధ సన్నివేశాలకు వచ్చేసరికి ప్రేక్షకులతో హాహాకారాలు పెట్టిస్తుంది.

Aadipurush 1

మనం చూస్తున్నది రామాయణ గాథ అని పూర్తిగా మరిచిపోయి.. ఏదో కార్టూన్ మూవీ చూస్తున్నట్లు.. రాముడు వెళ్లి ఏలియన్స్ తో తలపడుతున్నట్లుగా.. పూర్తిగా ఒక అసహజమైన వాతావరణంలో సాగే యుద్ధ సన్నివేశాలు.. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో ఏమో కానీ.. అవి సినిమాకు ఆకర్షణగా మారాల్సింది పోయి.. ప్రేక్షకులు వెటకారంగా నవ్వుకునేలా చేశాయి. ద్వితీయార్ధంలో ఒక ముప్పావు గంట దాకా పోరాట సన్నివేశాలతోనే సాగిపోతుంది ‘ఆదిపురుష్’. అది నడుస్తున్నంతసేపు మనం చూస్తున్నదేంటో అర్థం కాని అయోమయంలోనే ఉంటాం. ఎమోషనల్ కనెక్ట్ రవ్వంతైనా లేకుండా.. చాలా కృత్రిమంగా సాగే ఆ వార్ ఎపిసోడ్ ‘ఆదిపురుష్’కు అతి పెద్ద మైనస్. ప్రభాస్ కు మీసం పెట్టించి.. అతడితో సిక్స్ ప్యాక్ చేయించి మనం ఇంతవరకు చూడని ఒక కొత్త రాముడిని చూపించడానికి ఓం రౌత్ ప్రయత్నించాడు. ఈ పాత్ర లుక్స్ వరకు కొంత లిబర్టీ తీసుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కనీసం రాముడికి తొడిగిన బట్టలు.. తన జులపాల జుట్టు.. ఆ పాత్రకు రాసిన సంభాషణలు చూసి సర్దుకుపోవచ్చు. కానీ రావణుడి పాత్రను తీర్చిదిద్దిన తీరు.. తన లుక్స్ చూశాక మాత్రం అతను రావణుడు అని.. మనం చూస్తున్నది రామాయణం అని నమ్మాలంటే మాత్రం చాలా చాలా కష్టం. ఈ లుక్స్ చాలవన్నట్లుగా.. ఒక సన్నివేశంలో ముఖానికి వెల్డర్ లాగా మాస్క్ వేసుకుని కొలిమి దగ్గర కత్తి తయారు చేస్తూ కనిపిస్తాడు రావణుడు. ఇంకో సీన్లో ఏమో ఏలియన్ తరహా జీవికి మాంసపు ముక్కలు పెడుతుంటాడు.

Aadipurush 2

రావణుడు బేసిగ్గా విలనే అయినా సరే.. ఆ పాత్రతోనూ ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది ప్రేక్షకులకు. అలాంటి పాత్రను ఇలా ఎందుకు చూపించడంలో దర్శకుడికే తెలియాలి. ఈ సినిమా ఆరంభ సన్నివేశాలు.. అలాగే ప్రథమార్ధం ఓకే అనిపిస్తాయి. అక్కడక్కడా కొంత అసహజత్వం ఉన్నప్పటికీ.. రామాయణాన్ని మోడర్నైజ్ చేసి చూపిస్తున్నారని సర్దుకుపోవచ్చు. తెలిసిన కథనే ఆసక్తికరంగానే చెబుతున్నట్లు అనిపిస్తుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఆంజనేయుడి పాత్ర.. రాముడితో తన అనుబంధాన్ని చూపించిన సన్నివేశాలు బాగానే అనిపిస్తాయి. వాలి-సుగ్రీవుల యుద్ధ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక లంకకు వెళ్లడానికి అడ్డుగా ఉన్న సముద్రం మీదికి రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించబోతే… సముద్రుడు నీటితో ఒక రూపాన్ని సంతరించుకుని రాముడికి ప్రణామం చేసి లంకకు వెళ్లే మార్గం చూపించే సన్నివేశాన్ని తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. టెక్నాలజీని ఉపయోగించి సముద్రుడి అవతారాన్ని క్రియేట్ చేసిన విధానం చూస్తే.. ఓం రౌత్ సరైన దారిలోనే వెళ్తున్నాడనిపిస్తుంది. కానీ రాముడి చుట్టూ సహజంగా అనిపించే వాతావరణం.. లంకకు మళ్లగానే చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. అసలు లంకను తీర్చిదిద్దిన విధానంలోనే సినిమా గాడి తప్పేసింది. అక్కడి భవనాలు చూస్తుంటే ‘సాహో’ సినిమాలో చూపించే సిటీ గుర్తుకు వస్తుంది. అక్కడి మనుషులంతా ఏలియన్స్ లాగా ఉంటారు. రావణుడి చుట్టూ ప్రతి విషయం చాలా అసహజంగా తయారై.. యుద్ధ సన్నివేశాల్లో కూడా ఎక్కడ లేని కృత్రిమత్వం చోటు చేసుకుని.. రాముడు వెళ్లింది లంకకు అని.. యుద్ధం చేస్తోంది రావణుడితో అనే ఫీలింగే కలగదు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి.. సినిమా ఎప్పుడు ముగుస్తుందా అనే ఫీలింగ్ కలిగిస్తాయి.

Aadipurush 3
ప్రభాస్ ను రాముడిగా చూసి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. తర్వాత అతను ఓకే అనిపిస్తాడు. హనుమంతుడు.. లక్ష్మణుడు పాత్రలకు ఇచ్చిన ఎలివేషన్ రాముడికి దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కనిపించిన ప్రతిసారీ చికాకు పెట్టే రావణుడి పాత్రకు ఉన్న ప్రాధాన్యం కూడా రాముడికి లేదనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ నటన.. తన డైలాగ్ డెలివరీ బాగున్నాయి. కొన్ని చోట్ల ప్రభాస్ లుక్స్ మాత్రం తేడా కొట్టేశాయి. సీత పాత్రలో కృతి సనన్ పర్వలేదు అనిపిస్తుంది. సీత పట్ల మామూలుగా కలిగే భక్తి.. ఆరాధన భావం తనను చూస్తే కలగదు. కథలో ఆమె పాత్రకు దక్కిన ప్రాధాన్యం.. తన స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ తేలిపోయాడు. అతనే సినిమాకు అతి పెద్ద మైనస్. తన లుక్స్ నుంచి ప్రతిదీ తేడా కొట్టేసింది. హనుమంతుడిగా దేవదత్త నాగె బాగానే చేశాడు. తన పాత్ర హైలైట్ అయింది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ఓకే. ‘ఆదిపురుష్’కు అతి పెద్ద బలం అజయ్-అతుల్ సంగీతమే. జై శ్రీరామ్ పాటతో వాళ్లు మంచి మార్కులు కొట్టేశారు. మిగతా పాటలు పర్వాలేదు. అజయ్-అతుల్ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. జై శ్రీరామ్ పాటను ఆర్ఆర్ కు అనుబంధంగా బాగా ఉపయోగించుకున్నారు. కార్తీక్ పళని ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. సినిమాకు బాగానే ఖర్చు పెట్టిన సంగతి తెరపై కనిపిస్తుంది. దర్శకుడు తనకున్న వనరులను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. టెక్నాలజీని అతను దుర్వినియోగం చేశాడు. పాత్రల ఆహార్యం.. యుద్ధ సన్నివేశాల విషయంలో తన విజువలైజేషన్ పూర్తిగా రాంగ్ ట్రాక్ పట్టేసింది. అతను మంచి అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు అనే చెప్పాలి.

టైటిల్‌ :ఆదిపురుష్
నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగె తదితరులు దర్శకత్వం: ఓం రౌత్
నిర్మాతలు: భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్,రాజేష్ నాయర్
సంగీతం: అజయ్ అతుల్

చివరగా.. చిన్న పిల్లలకి నచ్చే మోడ్రన్‌ ‘రామాయణం’

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu