అబ్బాయి ఫంక్షన్ కు బాబాయ్ గెస్ట్!

మొన్నామధ్య మెగా ఫ్యామిలీకి పవన్ కల్యాణ్ కు పడడం లేదంటూ వార్తలు వచ్చాయి. కానీ
ఓ ఆడియో ఫంక్షన్ ద్వారా మా మధ్య ఎలాంటి గొడవలు లేదవి ఘాటుగా స్పందించాడు
హీరో రామ్ చరణ్. అలానే ‘సర్ధార్ గబ్బార్ సింగ్’ సినిమాకు మెగాస్టార్ అతిథిగా విచ్చేసి పవన్
కల్యాణ్ తో పాటు అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగుతూ.. అప్పటివరకూ ఉన్న అనుమాలన్నింటినీ
పటాపంచలు చేశారు. అయితే ఆ ఫంక్షన్ కు చరణ్ రాలేదనే వెలితి కనిపించింది. ఇప్పుడు
ఆ లోటుని కూడా తీర్చడానికి మెగాహీరోలు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 20న హైదరాబాద్
లో ‘ధృవ’ ఆడియో వేడుకను ఘనంగా జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ ఆడియో వేడుకలో
ముఖ్య అతిధిగా పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సురేందర్
రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీపావళి
కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here