సూపర్ స్టార్ మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏప్రిల్ 12 నుండి 16 మధ్యలో అభిమానులతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. దీంతో అభిమానులంతా.. ఫుల్ ఖుషీ అయిపోయారు. కానీ ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగా శనివారం రజినీకాంత్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు వేల సంఖ్యంలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా తమ అభిమాన నటుడితో ఫోటో దిగాలని ఆరాట పడతారు. దీంతో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉంది.

ఈ కారణంగానే కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా శ్రీలంక పర్యటనను ఇలానే రద్దు చేశారు రజిని. మరోసారి ఇలా చేయడంతో అభిమానులు నిరాశ చెందారు. వాళ్ళను కాస్త అయినా.. సంతోషంగా ఉంచాలని వారికో హామీ ఇచ్చాడు. భవిష్యత్తులో జిల్లాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అభిమానులతో మీటింగ్స్ లో పాల్గొంటానని చెప్పారు. అప్పుడు విడివిడిగా ఫోటోలు తీసుకోవచ్చనేది ఆలోచన.