అభిషేక్ పిక్చర్స్ సంస్థ పనైపోయిందా..?

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. సినిమాల మీద ఫ్యాషన్ తో ఎంతో ఖర్చుపెట్టి నిర్మతలుగా
మారి నష్టపోయిన వారి సంఖ్య తక్కువేమీ లేదు. అయితే రీసెంట్ గా అభిషేక్ పిక్చర్స్ అంటూ
టాలీవుడ్ లో ఓ నిర్మాణ సంస్థ తెగ హడావిడి చేసింది. దిల్ రాజుకి పోటీగా వెళ్ళి మరీ సినిమాలను
సొంతం చేసుకుంది. పెద్ద సినిమాలను టార్గెట్ చేసిన ఈ సంస్థ సడెన్ గా చేతులెత్తేసిందని
చెబుతున్నారు. బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ ల ప్రాజెక్ట్ ను ఒప్పుకొని సడెన్ గా ప్రాజెక్ట్
నుండి జారుకుంది. అసలు విషయం ఏంటా..? అని ఆరా తీయగా.. నిజానికి కొంతమంది
రాజకీయనాయకులు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారట. మొదట ఈ సంస్థ తన ప్రయాణాన్ని
బలంగానే మొదలుపెట్టినప్పటికీ పంపిణీ చేసిన ప్రతి సినిమా నష్టాల్ని మిగల్చడంతో కాస్త
డీలా పడింది. ఆశించిన లాభాలు రాకపోవడంతో పెట్టుబడి పెట్టేవాళ్లు కాస్త తప్పించుకున్నారు.
ఆర్థిక సహాయం చేసే వారు లేక ఒక్కో సినిమాను ఈ సంస్థ వదులుకుంటుందని తెలుస్తోంది.
5 సినిమాల నిర్మాణం చేపట్టిన అభిషేక్ పిక్చర్స్ వారు ప్రస్తుతం రెండు సినిమాలను మాత్రమే
నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వాటి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందట.

CLICK HERE!! For the aha Latest Updates