భారీ యాక్షన్ సీన్స్ లో పవన్!

పవన్ కల్యాణ్ హీరోగా.. డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కాటమరాయుడు’. తమిళంలో విజయం సాధించిన ‘వీరమ్’ సినిమాకు ఇది  రీమేక్ అని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. భారీ రైల్వే స్టేషన్ సెట్ వేసి పవన్ కల్యాణ్..  విలన్ గ్యాంగ్ కు మధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో శృతిహాసన్ కూడా పాల్గొంటుంది.

ఈ యాక్షన్ ఎపిసోడ్ ను రామ్,లక్ష్మణ్ మాస్టర్స్ వెరైటీగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని  చెబుతున్నారు. ఫ్యాక్షన్ నేపధ్యంలో రూపొందుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది  మార్చి నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కాకుండా పవన్ చేతిలో త్రివిక్రమ్, నేసన్ దర్శకులతో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.