వెంకీ సినిమా టైటిల్ ఇదే!

దర్శకుడు తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో తిరిగి మళ్ళీ పూర్వవైభవాన్ని పొందాడు. ఇప్పుడు అదే జోరుతో హీరో వెంకటేష్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెలలోనే సినిమాను మొదలుపెట్టనున్నారు. సురేష్ బాబు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాకు టైటిల్ గా ‘ఆట నాదే.. వేట నాదే’ అనే పేరుని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఇదే టైటిల్ గా అనుకుంటున్నారని మంచి టైటిల్ దొరికిదే మార్చే అవకాశాలు ఉన్నాయని యూనిట్ వర్గాల
ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు తేజ.. ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. ముందుగా.. వెంకీ సినిమాను పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు.