పవన్ రంగంలోకి దిగుతాడా..?

పవన్ కల్యాణ్ నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు పంపిణీదారులు. నిజానికి సర్ధార్ సినిమా కారణంగా నష్టపోయిన బయ్యర్లను కాటమరాయుడుతో ఆదుకుంటామని అప్పట్లో చిత్రబృందం వెల్లడించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యని కృష్ణాజిల్లాకు చెందిన సంపత్ కుమార్ అనే పంపిణీదారుడు ఆందోళనకు దిగాడు.

రెండు రోజులుగా నిరాహారదీక్ష చేపట్టాడు. తనకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తానని చెబుతున్నారు. అదే గనుక జరిగితే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సినిమా రిలీజ్ వాయిదా పడితే అభిమానులు నిరాశ చెందక తప్పదు గనుక పవన్ స్వయంగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.