HomeTelugu Trendingరోడ్డు ప్రమాదంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటికి తీవ్ర గాయాలు..

రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటికి తీవ్ర గాయాలు..

6 15
ముంబై- పూణే హైవే పై ఈ శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు… వెనుక నుంచి ఓ ట్రక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో షబానా అజ్మీ భర్త జావేద్‌ అక్తర్‌ కూడా ఉన్నారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు కారు డ్రైవర్‌ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే షబానా అజ్మీని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu