HomeTelugu Trendingకాంగ్రెస్‌లో చేరిన నటి దివ్యవాణి

కాంగ్రెస్‌లో చేరిన నటి దివ్యవాణి

actress divyavani joins con
ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దివ్యవాణికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఠాక్రే సాదరంగా ఆహ్వానించారు.

2019లో దివ్యవాణి టీడీపీలో చేరారు. పార్టీ నేతలతో ఏర్పడిన విభేదాల కారణంగా గత ఏడాది టీడీపీకి గుడ్ బై చెప్పారు. దివ్యవాణి చేరికతో కాంగ్రెస్ కు మరింత సినీ గ్లామర్ వచ్చింది. ఇప్పటికే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

అయితే, దివ్యవాణికి పార్టీ నాయకత్వం ఎలాంటి బాధ్యతలను అప్పగిస్తుందనే విషయం వేచిచూడాలి. ప్రస్తుతం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!