ఎలాంటి ప్రచారం జరిగినా భయపడను: నటి

నటి గాయత్రి రఘురాం శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో కారు నడుపుతూ అడయారులో పోలీసులకు పట్టుబడి వారితో వాగ్వాదానికి దిగిన విషయం కలకలం సృష్టించింది. రూ.3,500 జరిమానా కూడా చెల్లించినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై గాయత్రి రఘురాం సోమవారం ట్విటర్‌లో వివరణ ఇచ్చారు. అందులో ఏదో ఉన్నట్టుగా నాపై అసత్య ప్రసారం చేస్తున్నారు. వాటికంటే నాకు నా ఆత్మాభిమానం, జీవితం ముఖ్యం.

నిజానికి జరిగిందేమిటంటే శనివారం రాత్రి షూటింగ్‌ ముగించుకుని సహ నటీనటులను వారి ఇంటికి చేర్చాను. తరువాత ఒంటరిగా కారులో మా ఇంటికి వెళ్లుతుండగా ట్రాఫిక్‌ పోలీసులు సాధారణ సోదాలు జరిపారు. అయితే నా డ్రైవింగ్‌ లైసెన్స్, ఇతర పత్రాలు వేరు జేబులో ఉండిపోవడంతో వాటిని పోలీసులకు చూపలేకపోయాను. అయినా నేను కారు డ్రైవింగ్‌ చేసుకుంటూ వస్తే మద్యం మత్తులో ఉంటే పోలీసులు ఎలా కారు నడపడానికి అనుమతిస్తారు? నా గురించి ఎలాంటి ప్రచారం జరిగినా భయపడేది లేదని ఆమె పేర్కొంది.