‘సవ్యసాచి’ మూవీ ట్రైలర్‌

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ‘ప్రేమ, కోపంలాంటి భావోద్వేగాలు మీకొస్తే మీరు మాత్రమే రియాక్ట్‌ అవుతారు. అదే నాకొస్తే నాతో పాటు ఇంకొకడు కూడా రియాక్ట్‌ అవుతాడు. వాడే నా ఎడమ చెయ్యి’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. నాగచైతన్యకు తెలీకుండానే అతని ఎడమ చెయ్యి రియాక్ట్‌ అవడం ట్రైలర్‌లో ఫన్నీగా చూపించారు.

ఇందులో మాధవన్‌ విలన్‌ పాత్ర పోషించారు. నాగచైతన్యను, అతని కుటుంబాన్ని టార్చర్‌ చేస్తుంటారు. స్పృహకోల్పోయిన నాగచైతన్యను చూస్తూ ‘వీడ్ని చూస్తుంటే పద్మవ్యూహంలో పడిపోయిన అభిమన్యుడులా ఉన్నాడు కదూ..’ అని మాధవన్‌ అంటారు. ఇందుకు పక్కనే ఉన్న తాగుబోతు రమేశ్‌ స్పందిస్తూ..’మీరన్నది కరక్టే సర్‌. కానీ అతను అభిమన్యుడు కాడు. అర్జునుడు’ అని చెప్పడం ఆకట్టుకుంటోంది. ‘చావైనా నిన్ను చేరాలంటే అది నీ ఎడమ చెయ్యి దాటి రావాలి’ అంటూ రావు రమేశ్‌ చెప్తున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో భూమిక..నాగచైతన్యకు అక్క పాత్రలో నటించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నవీన్‌, రవి, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. నవంబర్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates