HomeTelugu Trendingమీరా జాస్మిన్‌ న్యూలుక్‌.. వైరల్‌

మీరా జాస్మిన్‌ న్యూలుక్‌.. వైరల్‌

Actress meera jasmine lates
నటి మీరా జాస్మిన్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఈమె స్టార్‌ హీరోయిన్‌. అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానులకు సంపాదించుకుంది. పవన్‌ కల్యాణ్‌,బాలకృష్ణ లాంటి స్టార్‌ హీరోలకు నటించి, మెప్పించింది. డబ్బింగ్ మూవీ ‘రన్‌’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది మీరాజాస్మిన్‌. ఆ త‌ర్వాత 2004లో శివాజీ ‘అమ్మాయి బాగుంది’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తనదైన అభినయంతో తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పవన్ కల్యాణ్‌తో కలిసి గుడుంబా శంకర్‌లో నటించింది. ఈ చిత్రంలో మీరాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది.

2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్‌ జాన్‌ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. కొన్నాళ్ల తర్వాత విభేదాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆ తర్వాత కూడా సినిమాల వైపు తిరిగి చూడలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మీరా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే మలయాళంలో ‘మకల్‌’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తుందట. ఇప్పటికే బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. తెరపై బొద్దగా ఉండే మీరా.. ఇప్పుడు చాలా సన్నబడింది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నాలుగు పదుల వయసులో కూడా మీరా..గతంలో కంటే అందంగా కనిపిస్తోంది. రీఎంట్రీ కోసమే ఈ అమ్మడు వెయిట్ లాస్ అయిందట. సన్నబడిన మీరా జాస్మిన్‌ ఫోటోలు చూసి నెటిజన్స్‌ షాకవుతున్నారు. మీరా ఏంటి.. ఇంత సన్నబడింది? సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!