సుకుమార్‌ చేతుల మీదుగా ‘దొరసాని’ ట్రైలర్‌

క్రేజీ హీరో.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా నటిస్తున్న ‘దొరసాని’ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్నది. జులై 12వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదల అయ్యింది. టీజర్ ఆకట్టుకుంది. సాంగ్స్ కూడా పర్వాలేదని అనిపించాయి. ఈ సినిమా టీజర్‌ను జులై 1వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ కాబోతున్నది. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్. 1980 దశకంలో తెలంగాణాలో ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకొని సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ ను బట్టి సినిమాను అంచనా వెయ్యొచ్చు.