
టాలీవుడ్ నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటోందని, ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఆమె వద్ద పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఆమె అంగీకరించిందని మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రగతి స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్టు చేశారు.
“నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ మీడియాలో వార్త వచ్చింది. ఇది అత్యంత బాధ్యతారాహిత్యంతో కూడిన విషయం. మీరు ఒక సంస్థను నడుపుతున్నారు… అందులో ఎంతోమంది చదువుకున్నవాళ్లు ఉంటారు. మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక న్యూస్ ను ప్రచారం చేశారు. నేను కేవలం ఒక నటిని మాత్రమే కావొచ్చు మీరేం రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా? నేను దీన్ని ఖండిస్తున్నాను.
నా వ్యక్తిగత జీవితంపై రాసే హక్కు మీకెక్కడిది? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఇష్టం వచ్చినట్టు రాయడం బాధాకరం. ఆధారాలు ఉన్నప్పుడు రాస్తే పర్వాలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాయడం ద్వారా మీ మీడియా సంస్థను దిగజార్చకండి. ఇకనైనా నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే రాయండి. జర్నలిస్టు విలువలు అనేవి ఉంటే వాటిని పాటించండి. నాపై వార్త రాయడం మాత్రం కచ్చితంగా అనైతికం” అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది.
https://www.instagram.com/reel/Cy-ves8yu4k/?utm_source=ig_web_copy_link












