HomeTelugu Trendingచిరంజీవి సినిమాలో చాన్స్ మిస్ చేసుకున్న రష్మిక

చిరంజీవి సినిమాలో చాన్స్ మిస్ చేసుకున్న రష్మిక

Rashmika chiru chance
తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మిక ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్ డమ్ ను అందుకుంది. బాలీవుడ్‌లో సైతం మెరిసింది. ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది.

బాలీవుడ్‌లో వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉంది రష్మిక. హిందీ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల దక్షిణాదిలో కొన్ని ఆఫర్లను కోల్పోతోంది. రష్మిక మాట్లాడుతూ సినీ రంగంలో అదృష్టం కూడా చాలా ముఖ్యమని తెలిపింది

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో, తమిళ స్టార్ విజయ్ ‘మాస్టర్’ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అంత పెద్ద స్టార్స్‌తో నటించే అవకాశాన్ని వదులుకోవడం బాధగా ఉందని తెలిపింది.

కష్టపడి పని చేస్తే ఏ రంగంలోనైనా విజయ సాధించవచ్చని తెలిపింది. తాను మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌గా ఎదిగినట్లు వివరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!