చరణ్ సినిమాలో రాశి!

ఒకప్పటి హీరోయిన్ రాశి రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కల్యాణ వైభోగమే అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఆమెకు మంచి పేరే తీసుకొచ్చింది. అలా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ.. వస్తోన్న ఆమె తాజాగా చరణ్ సినిమాలో
అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు సినిమాలో ప్రాముఖ్యత ఉండడంతో సుకుమార్ ఆమెను ఎంపిక చేశాడని అంటున్నారు. ఈ సినిమా రాశి కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. పల్లెటూరి నేపధ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో చరణ్ కూడా కొత్త లుక్ తో కనిపించనున్నారు. సినిమాలో హీరోయిన్ గా రాశిఖన్నా, అనుపమ పరమేశ్వరన్ ల పేర్లను పరిశీలిస్తున్నారు.