HomeTelugu Trendingనటి రెంజూష మీనన్ ఆత్మహత్య

నటి రెంజూష మీనన్ ఆత్మహత్య

Renjusha Menon
మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. యువ నటి రెంజూషా మేనన్(35) అనుమానాస్పదంగా మృతిచెందింది. పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. రెంజూషా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు, స్థానికులు అనుకుంటున్నారు.

సోమవారం తిరువనంతపురంలోని తన నివాసంలో రెంజూషా విగత జీవిగా పడి ఉందని పోలీసులకు సమాచారం అందటంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొచ్చికి చెందిన రెంజూషా మొదట టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. అంతేకాకుండా పలు టీవీ సీరియళ్లలో నటించారు. సినిమాల్లో సహాయ నటిగా చేశారు. పలు సీరియళ్లకు నిర్మాతగానూ వ్యవహరించారు. రెంజూషా మృతిపై పలువురు సినీ ప్రముఖులు షాక్‌కు గురయ్యారు. ఆమె మృతికి సంతాపం తెలియజేశారు.

రెంజూషా మరణానికి ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించిందని ఇంతలోనే ఇలా జరగడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఆనందరాగం అనే టీవీ షోలో లీడ్‌ రోల్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!