HomeTelugu Trending'కేజీఎఫ్2' నుండి 'అధీర' లుక్‌ విడుదల

‘కేజీఎఫ్2’ నుండి ‘అధీర’ లుక్‌ విడుదల

Adheera First Look fromKGF
యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌‌1’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌: చాప్టర్‌2’ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇందులో ‘అధీర’ పాత్రను పోషిస్తున్నారు. నేడు సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా అధీరా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మేకర్స్.. కూరత్వానికి ప్రతిరూపం అధీర.. అంటూ ఫొటోను చేశారు. ఇందులో ఆయన డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌లో నుదుటిపై టాటూ వేసుకుని కత్తికి తల ఆన్చి కనిపించారు. మొదటి భాగంలో అధీర పాత్ర అసలు కనిపించలేదు. మరి కేజీఎఫ్2లో అధీర పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో చూడాలి.

ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రధానిగా రవీనా టాండన్‌ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్‌ నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!