HomeTelugu Big Storiesఆదిపురుష్:‌ సీత ఫిక్స్‌.. ప్రకటించిన చిత్రబృందం

ఆదిపురుష్:‌ సీత ఫిక్స్‌.. ప్రకటించిన చిత్రబృందం

Adipurush heroine officiaయంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించనున్న బాలీవుడ్‌ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓంరౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన ఎవరు నటించనున్నారనే విషయంలో గత కొన్నిరోజులుగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనుష్క శెట్టి, కీర్తిసురేశ్‌ పేర్లు కూడా వినిపించాయి. కాగా, ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌కు జంటగా సీత పాత్రలో కృతిసనన్‌ నటిస్తున్నారని చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే, బాలీవుడ్‌ నటుడు సన్నీసింగ్‌ లక్ష్మణుడిగా నటించనున్నారు.

‘ఆదిపురుష్‌’ టీమ్‌లోకి కృతిసనన్‌, సన్నీసింగ్‌లకు స్వాగతం పలుకుతూ శుక్రవారం ఉదయం చిత్రబృందం కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. అందులో ప్రభాస్‌, కృతిసనన్‌, సన్నీసింగ్‌ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పాన్‌ ఇండియా మూవీగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌హీరో సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా కనిపించనున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

Recent Articles English

Gallery

Recent Articles Telugu